భారతదేశం, సెప్టెంబర్ 14 -- తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన సూపర్ హీరో చిత్రం మిరాయ్ గత శుక్రవారం (సెప్టెంబర్ 12) థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తోంది. ఈ చిత్రంలోని వీఎఫ్ఎక్స్, కదిలించే విజువల్స్, బలమైన స్క్రిప్ట్ ను చాలా మంది ప్రశంసించారు. తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా మిరాయ్ పై ప్రశంసలు కురిపించాడు. మిరాయ్ పై ఆర్జీవీ రివ్యూ వైరల్ గా మారింది.

మిరాయ్ మూవీలోని వీఎఫ్ఎక్స్.. రూ.400 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల కంటే చాలా బెటర్ అని ఆర్జీవీ అన్నారు. "మిరాయ్ చూసిన తర్వాత చివరిసారిగా రూ.400 కోట్ల సినిమాలు అని పిలవబడే మూవీస్ లోని విఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్ గా అనిపించినట్లు నాకు గుర్తు లేదు. హే మనోజ్ మీరు విలన్ గా నటించి తప్పు చేశారనుకున్నా. కానీ మీ యాక్టింగ్ చూసి చెంపదెబ్బలు వేసుకున్నా'' అని ఎక్స్ లో...