భారతదేశం, మే 7 -- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత వారం అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తరచూ బోల్డ్ లుక్‍లో కనిపించే హిందీ నటి అవ్‍నీత్ కౌర్ ఫొటోకు లైక్ కొట్టాడు. దీంతో రూమర్లు గుప్పుమన్నాయి. అవ్‍నీత్ ఫొటోకు విరాట్ లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియా వైరల్‍ అయ్యాయి. చర్చకు దారి తీశాయి. దీనిపై విరాట్ కోహ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు. పొరపాటును లైక్ పడిందని తెలిపారు. అయితే, ఈ తతంగం మాత్రం అవ్‍నీత్ కౌర్‌కు విపరీతంగా కలిసి వచ్చింది.

విరాట్ కోహ్లీ లైక్ అంశంతో అవ్‍నీత్ కౌర్ నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. కొన్ని రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా నిలిచారు. ఇది అవ్‍నీత్‍కు బాగా కలిసి వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రమోషన్లకు వాల్యూ 30 శాతం వరకు పెరిగిందని బజ్‍క్రాఫ్ట్ వెల్లడించింది. ఈ తతంగం ముందు ఇన్‍స్టాగ్రామ్‍లో ఒక్కో ప్రమోషనల...