భారతదేశం, జనవరి 28 -- మహారాష్ట్ర రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన అజిత్ పవార్ (66) ఇకలేరు. జనవరి 28, బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

అజిత్ పవార్ తన భద్రతా సిబ్బందితో కలిసి ముంబై నుంచి 'లియర్ జెట్ 45' (Learjet 45 - VT SSK) అనే ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఉదయం 8:48 గంటల ప్రాంతంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది.

బారామతి ఎయిర్‌పోర్ట్ మేనేజర్ శివాజీ తవారే ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ.. "విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి...