భారతదేశం, డిసెంబర్ 5 -- ఇండిగో విమానయాన సంస్థ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi Airport) గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. సిబ్బంది కొరత (Crew-Related Issues) కారణంగా ఇండిగో ఏకంగా 163 దేశీయ విమానాలను రద్దు చేసింది. దీనివల్ల ఒక్క ఢిల్లీలోనే సుమారు 16,500 మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

రద్దయిన 163 విమానాలలో 77 రావాల్సిన విమానాలు (Arrivals) కాగా, 86 పోవాల్సిన విమానాలు (Departures) ఉన్నాయి. అంతేకాకుండా, ఆ రోజు బయలుదేరాల్సిన 101 విమానాల్లో 98 ఆలస్యంగా బయలుదేరాయి. విమాన సగటు ఆలస్యం దాదాపు 160 నిమిషాలుగా ఉందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్ (HT)కు తెలిపారు. ఇండిగో ఈ నిర్వహణా సంక్షోభం (Operational Crisis) కారణంగా చాలా మంది ప్రయాణికులు 24 గంటలకు పైగా వి...