భారతదేశం, డిసెంబర్ 19 -- భారతీయ విమానయాన రంగం రాబోయే కాలంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోనుందని అదానీ గ్రూప్ గట్టిగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ గ్రూప్ ప్రకటించింది. దేశీయ విమానయాన రంగం ఏటా 15-16 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాలతో ఈ మెగా ప్లాన్ సిద్ధం చేసింది.

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఈ నెల 25వ తేదీన (డిసెంబర్ 25) వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ చారిత్రాత్మక సందర్భానికి ముందు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్, గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ గ్రూప్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న ఒత్తిడిని తగ్గించడా...