భారతదేశం, ఏప్రిల్ 7 -- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌‌లోని చిఖల్తన విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ విమానాశ్రయ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది.

ఇండిగో విమానం ముంబై నుంచి వారణాసికి బయలుదేరింది. సుశీలా దేవి అనే వృద్ధురాలు విమానం ఎగిరిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు అత్యవసర చికిత్స అవసరమవడంతో విమానం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చిఖల్తన విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసింది. అయితే, వైద్య బృందం ఆమెను పరీక్షించే సమయానికి ఆమె మరణించిందని అధికారి పీటీఐకి తెలిపారు.

ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ వాసి. పోలీసులు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత విమానం వారణాసికి బయలుదేరింది. ఆమె మృతదేహాన్ని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత...