భారతదేశం, మే 5 -- ిల్లీ నుండి షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగగానే నిందితుడి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు విమానంలోని టాయిలెట్ దగ్గర ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకాడు. బాధితురాలు వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయంలో ఉన్న భద్రతా అధికారులకు దీని గురించి సమాచారం ఇచ్చారు.

నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతను మద్యం మత్తులో ఈ నేరం చేశాడని తేలింది. దిల్లీ-షిర్డీ విమానం నంబర్ 6E 6404లో ఎయిర్ హోస్టెస్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు గానూ కేసు నమోదైంది. అధికారులు తెలిపిన ప్రకారం ల్యాండ్...