భారతదేశం, నవంబర్ 30 -- గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమానే అఖండ 2 తాండవం. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేశారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో అఖండ 2 సినీ విశేషాలను పంచుకున్నారు రామ్ లక్ష్మణ్.

-బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అభిమానులకు రియల్‌గా కనిపించాలి, అభిమానుల్ని అలరించాలనే తపనతో ప్రతి షాట్ ఆయనే చేశారు. ఇందులో 99% ఆయనే చేశారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది. ఆయనే చేయాలి.

-ఈ సినిమా కోసం విభూది కొన్ని టన్నులు వాడి ఉంటాము. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు మన మీద విభూది వర్షం కురిసినట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియెన్స్ మంచి వైబ్రేషన్‌తో ఉంటారు. శివ తత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది. సినిమ...