భారతదేశం, నవంబర్ 6 -- చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (నవంబర్ 6) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా సాగిపోయింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటంలాంటి వాళ్లు తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు.

తెలుగులో వస్తున్న మరో కామెడీ ఎమోషనల్ డ్రామా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటించారు. వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దేవర స్టోరీ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా.. వినే యాంకర్ ఉంటే వేణుస్...