Hyderabad, ఆగస్టు 23 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించి, వ్రత కథ చదువుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకుంటారు. విఘ్నాలను తొలగి విజయాలను తీసుకువచ్చే వినాయకుడి జన్మదినం నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి.

ఏ దేవుడికి ఇలా సమర్పించని 21 రకాల ఆకులతో వినాయకుని వినాయక చవితి నాడు ఆరాధిస్తాము. ఆకులను పత్రి అని అంటారు. పత్రపూజ చేసి వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఈసారి వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. చవితి నాడు వినాయకుడిని పూజించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వినాయకుడి పూజలో కచ్చితంగా 21 పత్రాలని సమర్పించండి. వినాయక చవితి నాడు ఈ పత్రాల పూజ ఎంతో వి...