Hyderabad, ఆగస్టు 22 -- వినాయక చవితి 2025: హిందూ మతంలో అనేక దేవుళ్ళు, దేవతలను పూజిస్తాము. ఏ దేవుడిని ఆరాధించినా వినాయకుడుని మొదట పూజిస్తాము. ఎందుకంటే వినాయకుడుని తొలి దేవుడని అంటారు. హిందూ మతంలో మొదటి ఆరాధ్య దైవంగా భావిస్తాము. ఏదైనా మంగళ కార్యం ప్రారంభానికి ముందు ఆయనను పూజిస్తారు. వినాయకుడు జీవితంలోని ప్రతి అవరోధాన్ని తొలగిస్తాడని నమ్ముతారు. అదే విధంగా మరి కొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతోంది.

ప్రతి భాద్రపద మాసం శుక్లపక్షం నాల్గవ రోజున గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా దీన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? అలాగే, వినాయక చవితికి ముందు ఇంటి నుండి ఏ వస్తువులను తొలగించడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాస...