Hyderabad, ఆగస్టు 23 -- ఎక్కడ చూసినా వినాయక చవితి హడావిడి కనబడుతోంది. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధిస్తే సకల సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మార్కెట్లో భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. వినాయక చవితి త్వరలోనే రానున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా అందమైన వినాయక విగ్రహాలు కనబడుతున్నాయి.

హిందూమతంలో అనేక పండుగలు ప్రజలను సానుకూల శక్తితో నింపుతాయి, ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి. వినాయక చవితిని మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుతారు. తొమ్మిది రోజులు పాటు వినాయకుడిని పూజిస్తారు. ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.

ఇవన్నీ పక్కన పెడితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, వినాయకుడికి తొండం ఎటువైపు ఉండాలి అని.. క...