భారతదేశం, మే 5 -- ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విషయంలో వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తోందని సీపీఎం ఆరోపిస్తోంది. అదానీ- సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా, విద్యుత్‌ రంగంలో మరింత భారం మోపే యాక్సిస్ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రమాదకరమని, కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే ప్రజలపై భారాలు పడుతున్నాయని ఆరోపించాయి.

ప్రజలపై శాశ్వతంగా భారాలు మోపేలా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతున్నారని, విద్యుత్ భారాలపై మాట తప్పి కూటమి ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని సీపీఎం ఆరోపించింది. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు, అవినీతి ఒప్పందాల రద్దుకై సిపిఎం ప్రజా ఉద్యమం చేపట్టింది.

మే 7వ తేదీన విజయవాడ విద్యుత్ సౌదా వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. దీనికోసం లక్షలాది సంతకాల సేకరణ చేపట్టారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో సంతకాలు సేకరణ...