Telangana, మే 29 -- కొన్ని రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాలంటే. ప్రతి విద్యార్థి వద్ద కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉండాల్సిందే. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు గాబరపడిపోతుంటారు. మండల కేంద్రాలు, మీ-సేవా సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ముందస్తుగానే వీటి విషయంలో ఓ అవగాహన ఉంటే ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ప్రవేశ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు బోనాఫైడ్ సర్టిఫికెట్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ (TC), కుల ధ్రువీకరణపత్రం, ఆదాయ సర్టిఫికెట్‌, నివాస ధ్రువపత్రం వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కాలర్‌షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ప్రయోజనాలు పొందాలంటే ఈ డాక్యుమెంట్లు మరింత కీలకం అవుతాయి.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి...