Telanagana, ఆగస్టు 29 -- పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన బోధ‌న సాగాల‌ని , విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని స్పష్టం చేశారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగ‌వ‌డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సంస్థ‌ల్లో లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. విద్యాశాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ప్ర‌మాణాలు, నిర్మ...