భారతదేశం, మే 20 -- రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే సమయానికి.. పుస్తకాలతో సహా బ్యాగు, దుస్తులు, షూ, బెల్టులతో కూడిన కిట్లు విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అందించాల్సిన కిట్ల వివరాలు ప్రభుత్వానికి నివేదించగా.. ఇప్పటివరకు పలు మండలాలకు వచ్చాయి. మిగతా కిట్‌లు ఈ నెలాఖరు నాటికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.

1.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తోంది. ఆర్భాటాలకు పోకుండా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ, కిట్లకు సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహనీయుల పేర్లు పెట్టి ముందుకు సాగుతోంది.

2.మండలాల వారీగా విద్యార్థుల సంఖ్యకు అవసరమైన మేరకు.. పాఠ్య, రాత పుస్తకాలతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల సర...