భారతదేశం, ఏప్రిల్ 19 -- కొన్ని వారాల్లో 1,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. దీంతో పలువురు విద్యార్థులు ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తున్నారు. అమెరికాలో ఉండేందుకు తనకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుందని చెబుతున్నారు. అమెరికాలో ఉండేందుకు ఫెడరల్ ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతిని ఉపసంహరించుకోవడంతో వందలాది మంది విద్యార్థులు నిర్బంధం, బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విద్యార్థులలో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం, ఒహియో స్టేట్ విశ్వవిద్యాలయం వంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు, కొన్ని చిన్న కళాశాలల విద్యార్థులు ఉన్నారు.

లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ప్రభుత్వమే నిర...