భారతదేశం, డిసెంబర్ 7 -- పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మిడ్ డే మిల్స్ స్కీమ్‌ను సెలవు రోజుల్లోనూ అందించనుంది. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి దాకా సెలవు రోజుల్లో సైతం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులకు హాజరు అయ్యే టెన్త్ విద్యార్థులకు రోజు వారీ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్ష కారణంగా ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరవుతారు. ఇటీవల పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయంలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. విద్యార్థులు ఆకలితో క్లాసులు వినాల్సి వస్తుం...