భారతదేశం, జనవరి 8 -- తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మెుత్తం 19 రోజులపాటు వీటిని అందించనున్నారు. ఇందుకోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు అయ్యాయి.

పదో తరగతి విద్యార్థులకు సాయంత్రంపూట స్నాక్స్ అందించాలని నిర్ణయిస్తూ.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోన విద్యార్థులకు వీటిని అందిస్తారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను వెంటనే.. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని చెప్పారు. అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స...