భారతదేశం, నవంబర్ 17 -- రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు మెుదలయ్యాయి. దీని ద్వారా విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. స్కూళ్లలో అప్డేట్ చేయవచ్చు. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఉంటాయి. విద్యాశాఖ, యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖ రాశారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడంతోపాటుగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అనేక మంది పిల్లల ఆధార్ అప్డేట్ కావాల...