Telangana, జూన్ 18 -- తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం చివరి విడత(థర్డ్ ఫేజ్) రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 19వ తేదీలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. సమయం దగ్గరపడిన నేపథ్యంలో.. అభ్యర్థులు వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 న...