Telangana, జూన్ 24 -- తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంకేతి విద్యాశాఖ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా. నేటి నుంచి జూన్ 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.

పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా.. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక జూలై 1వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకప...