Telangana,hyderabad, ఆగస్టు 13 -- దోస్త్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే అన్ని విడతలు పూర్తి కాగా. ఇవాళ్టి నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు. ఇవాళ, రేపు స్పాట్ ప్రవేశాల కింద డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.

ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే 3 విడతలు చేపట్టినప్పటికీ.. సీట్లు భారీగానే మిగిలాయి. అయితే స్పెషల్ ఫేజ్ కు అవకాశం కల్పించి. సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువు ఆగస్ట్ 12తో పూర్తి అయింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు 11 నుంచి 12 వరకు రాష్ట్రంలోని అన్ని ...