Tirumala,andhrapradesh, జూలై 24 -- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్ర‌వేశానికి జూలై 25, 26వ తేదీలలో ఉద‌యం 8 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

టీటీడీలో విధులు నిర్వ‌హిస్తున్న రెగ్యుల‌ర్‌ ఉద్యోగుల పిల్లలు, బాలమందిర్ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా సీటు వచ్చి వివిధ కారణాలతో మూడు విడ‌త‌లలో కౌన్సెలింగ్‌కు హాజ‌రు కానివారితో పాటు తిరుప‌తిలోని స్థానిక విద్యార్థి, విద్యార్థునులకు ప్రాధాన్యత ఉంటుందని టీటీడీ పేర్కొంది. జూలై 25న 550 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులు, జూలై 26న 450 మార్కులు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు హాజరు కావొచ్చని సూచించింది.

క‌ళాశాల‌లో మ...