Telangana,hyderabad, ఆగస్టు 30 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు. అడ్మిషన్ తీసుకునేందుకు రేపటి (ఆగస్ట్ 31) వరకు గడువు ఉంది. కాబట్టి విద్యార్థులు వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన టెన్త్ విద్యార్థులు. వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఫైనల్ ఛాన్స్ అని. ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు గడువు కూడా పెంచిన సంగతి తెలిసిందే.

ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయంతో. రాష్ట్రంలోని అన్ని ప్రభుత...