భారతదేశం, డిసెంబర్ 27 -- సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యార్థులు సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో సెలవులు ఖరారు కాగా. తెలంగాణలో మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది. ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఖరారు చేశారు.

అయితే ప్రస్తుతం పండుగల తేదీలు మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో గతంలో ప్రకటించిన తేదీలు మారనున్నాయి. తాజాగా జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే జనవరి 17వ తేదీన శనివారం పాఠశాలలు తిరిగి పున: ప్రారంభమవుతాయి. విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే. 5 రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. అయితే పండగ తేదీలు మారిన నేపథ్యంలో. మరో 2 రోజులు పెరగను...