భారతదేశం, జనవరి 19 -- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈజీగా వచ్చేలా ప్లాన్ చేసింది. TCS iONతో కలిసి కొత్త ప్రోగ్రామ్‌ను రూపొందించింది. టీసీఎస్ అన్ని అధ్యయన కేంద్రాల నుండి దీనిని యాక్సెస్ చేసేలా విద్యార్థుల కోసం జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

అంబేద్కర్ యూనివర్సిటీ, టీసీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కోర్సు మొదటి సెమిస్టర్ నుండి విద్యార్థులకు అందిస్తారు. కంపెనీల అవసరాలను తీర్చడానికి, వ్యాపార సంస్థలలో అవకాశాలను పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించారు. డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ కోర్సును ఏకకాలంలో పూర్తి చేయవచ్చని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు.

కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు టీసీఎస్ ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందుతారన...