భారతదేశం, నవంబర్ 10 -- కొంతమంది ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరుతో పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. తాజాగా మహబూబ్‌న‌గర్ జిల్లా జడ్చర్లలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు.. విద్యార్థిని దారుణంగా కొట్టాడు. విచక్షణ కోల్పోయి కొట్టడంతో విద్యార్థి కర్ణభేరి దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జడ్చర్లలో స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉంటూ సిద్ధార్థ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అల్లరి చేస్తున్నాడని ఉపాధ్యాయుడు నాగరాజు విచక్షణ కోల్పోయి విద్యార్థిని కొట్టాడు. ఎడమ చెవిపై కొట్టడంతో సిద్ధార్థ చెవికి బాగా దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పాడు.

తల్లిదండ్రులు వచ్చి విద్యార...