భారతదేశం, డిసెంబర్ 8 -- తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక దాడి కేసుపై హోం మంత్రి అని మాట్లాడారు. తిరుపతి ఎస్పీ, పోలీస్ ఉన్నతాథికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు. తిరుపతి ఎస్పీ పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కోసం ఒడిశాకు కూడా పోలీసులు బృందం వెళ్లిందన్నారు. విద్యార్థికి న్యాయం చేస్తామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణే మా లక్ష్యం అని హోం మంత్రి అనిత తెలిపారు.

ఈ కేసులో ఒడిశాకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో బి.ఎడ్ చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించి గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఫోన్లో రికార్...