భారతదేశం, నవంబర్ 18 -- శ్రీలంకలో ఒంటరిగా 'టుక్-టుక్' (ఆటో రిక్షాకు స్థానిక వాడుక పదం) నడుపుతూ రోడ్డు ట్రిప్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళా యాత్రికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్థానిక వ్యక్తి ఆమెను వెంటాడి, వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ మహిళా ట్రావెలర్​ శ్రీలంక ప్రయాణం మొదలుపెట్టి నాలుగో రోజున ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. ప్రయాణం సూర్యోదయం వేళ స్విమ్మింగ్‌తో ఉల్లాసంగా మొదలైనా, తర్వాత ఆమె మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది.

"నా ముందు స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి పదేపదే నెమ్మదిస్తూ, నేను అతన్ని దాటి వెళ్లగానే మళ్లీ వేగంగా వచ్చి నన్ను దాటిపోయేవాడు," అని ఆమె వీడియోలో వివరించింది. మొదట్లో నవ్వుతూ ఉన్నప్పటికీ, అతని ప్రవ...