భారతదేశం, జనవరి 27 -- మెయగత ఏడాది కాలంగా వీసా సమస్యలు, నిధుల కొరతతో సతమతమైన విదేశీ విద్యా రంగం మళ్లీ ఊపందుకుంది. ఫాల్ 2026 (Fall 2026) అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఇప్పుడు మరింత పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ విద్యార్థులకు అండగా నిలుస్తున్న ప్రముఖ సంస్థ 'ప్రాడిజీ ఫైనాన్స్' (Prodigy Finance) కీలక ప్రకటన చేసింది. ఫాల్ 2026 ఇన్‌టేక్ కోసం లోన్ అప్లికేషన్లను ప్రారంభించినట్లు వెల్లడించింది.

సాధారణంగా విదేశీ విద్య కోసం లోన్ కావాలంటే ఆస్తి పత్రాలు చూపించాలి, లేదా తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని నిరూపించుకోవాలి. కానీ ప్రాడిజీ ఫైనాన్స్ మాత్రం "నో కొలేటరల్, నో కో-సైన్" (No Collateral, No Co-Signer) విధానాన్ని అమలు చేస్తోంది. అంటే, ఎలాంటి ఆస్తి తనఖా లేకుండా, మరొకరి షూరిటీ అవసరం లేకుండానే అర్హులైన విద్యార్థులకు 2,20,000 డాలర్ల వర...