భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత రూత్ ప్రభు.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి, అలాగే దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏర్పడిన బంధం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. విడాకుల తర్వాత తాను పూర్తిగా కుంగిపోయానని, మళ్లీ ఇంకొకరిపై ఆధారపడతానని ఎప్పుడూ అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రాజ్ నిడిమోరు తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తనలో ఎంతో సానుకూల మార్పు వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్‌పై నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సినిమా పనులతో ఎంతో బిజీగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సమంత.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర...