Hyderabad, జూన్ 10 -- బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీ సితారే జమీన్ పర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటిస్తున్న సినిమా ఇది. దీనిపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన వ్యక్తిగత జీవితంతోపాటు సినిమాలు, కెరీర్ గురించి మాట్లాడాడు. పెళ్లిళ్ల విషయంలో సక్సెస్ కాకపోయినా.. విడాకుల విషయంలో అయ్యానని నవ్వుతూ అన్నాడు.

సితారే జమీన్ పర్ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న ఆమిర్ ఖాన్.. తాజాగా జూమ్ తో మాట్లాడాడు. "నా కుటుంబానికి సంబంధించి కూడా ఇదొక్క విషయంలో మేము అస్సలు సంతోషంగా లేము. మేమేదో సంతోషంగా ఈ పని చేయడం లేదు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా మధ్య బంధం మారిపోయిందని మాకు అనిపిస్తుంది.

అలాంటప్పుడు న...