భారతదేశం, మే 13 -- లాంగ్ గ్యాప్ త‌ర్వాత అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది విజ‌య‌శాంతి. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. వింటేజ్ విజ‌య‌శాంతిని గుర్తుచేసింది. లేడీ అమితాబ్ గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజ‌య‌శాంతి ఒక‌ప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా చెలామ‌ణి అయ్యింది. యాక్ష‌న్ సినిమాల‌తో అప్ప‌టి స్టార్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది.

విజ‌య‌శాంతి 1988లో ఎమ్‌వీ శ్రీనివాస ప్ర‌సాద్ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లిచేసుకున్న‌ది. విజ‌య‌శాంతి భ‌ర్త తెలుగులో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అదే నిప్పుర‌వ్వ మూవీ. బాల‌కృష్ణ, విజ‌య‌శాంతి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిప్పుర‌వ్వ‌ సినిమాను యువ‌ర‌త్న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య‌శాంతి భ‌ర్త ఎమ్‌వీ శ్రీనివాస ప్ర‌సాద్ నిర్మించాడు. ప్ర...