భారతదేశం, డిసెంబర్ 25 -- విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) బుధవారం (డిసెంబర్ 24) మొదలైన విషయం తెలుసు కదా. అయితే తొలిరోజే ఇది చరిత్ర సృష్టించింది. అసలు ఇది క్రికెట్ మ్యాచా లేక వీడియో గేమా అన్నట్టుగా స్కోర్లు నమోదయ్యాయి. బీహార్ టీమ్ 574 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించగా.. కర్ణాటక 413 రన్స్ ఛేజ్ చేసి షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తమ బ్యాట్లకు పనిచెప్పారు.

మామూలుగా టోర్నమెంట్లు నెమ్మదిగా మొదలవుతాయి. కానీ ఈసారి విజయ్ హజారే ట్రోఫీ మాత్రం బాంబు పేలినట్టు స్టార్ట్ అయ్యింది. రౌండ్-1లో నమోదైన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ టీమ్ బ్యాటింగ్ కాదు, విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్లకు 574 పరుగులు చేసింది. మెన్స్ లిస్ట్-A క్రికెట్ చరిత్రలో (ప్రపంచవ్యా...