భారతదేశం, మే 14 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్‍న్యూస్ ఇది. కింగ్‍డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనే హైప్ ఉంది. అయితే, మే 30న విడుదల కావాల్సిన కింగ్‍డమ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారైంది. ఈ వివరాలను మూవీ టీమ్ నేడు (మే 14) అధికారికంగా వెల్లడించింది.

కింగ్‍డమ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం వాతావరణంలో ప్రమోషన్లు, సెలెబ్రేషన్లు చేయడం సరికాదని అనుకుంటున్నామని, అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని పేర్కొంది.

ఈ వాయిదా వల్ల కింగ్‍డమ్ మూవీని మరింత అద్భుతంగా తీసుకొస్తామని సితార ఎంటర్‌టైన్‍మెంట్ ...