భారతదేశం, మే 6 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్‍డమ్' సినిమా ఈ మే 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లకు కూడా మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ సాంగ్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. అయితే, కిండ్‍గమ్‍కు ఇప్పుడు పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' టెన్షన్ పట్టుకుంది. ప్రమోషన్లు చేసేందుకు కూడా క్లారిటీ లేక డైలమా నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

హరి హర వీరమల్లు సినిమా కోసం కాస్త పెండింగ్‍లో ఉన్న షూటింగ్‍ను పూర్తి చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే సెట్స్‌లోకి వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. దీంతో హరి హర వీరమల్లు చిత్రం మే 30వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదే జరిగితే కింగ్‍డమ్ వాయిదా ప...