భారతదేశం, మే 16 -- వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకునే పనిలో ఉన్నాడు మన రౌడీ విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ వైపు 'కింగ్‌డ‌మ్‌' రిలీజ్ కు రెడీగా ఉండగా.. మరోవైపు మరో రెండు ప్రాజెక్ట్ లు విజయ్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఒకటైన 'రౌడీ జనార్ధన్' మూవీలో ఓ సీనియర్ టాలీవుడ్ హీరో కీ రోల్ ప్లే చేయబోతున్నారని తెలిసింది.

టాలీవుడ్ లో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు రాజశేఖర్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలతో మెప్పించారు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇతర మూవీస్ లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలో రాజశేఖర్ యాక్ట్ చేస్తున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 'రౌడీ జనార్ధన్' మూవీలో విజయ్ దేవరకొండ, రాజశేఖర్ కాంబినేషన్ ఉంటుందని టాక్.

విజయ్ దేవ...