Hyderabad, ఆగస్టు 1 -- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్, భాగ్యశ్రీ బోర్సే నటించిన కింగ్డమ్ గురువారం (జూలై 31) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో హృదయం లోపల అనే రొమాంటిక్ సాంగ్ లేదు. థియేటర్లలో చూసిన ఆడియెన్స్ ఆ సాంగ్‌ను ఎందుకు పెట్టలేదని నిరాశచెందారు.

ఇదే ప్రశ్న నటీనటులతో ఏర్పాటు చేసిన కింగ్డమ్ సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీకి ఎదురైంది. దానికి నిర్మాత నాగవంశీ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన కింగ్డమ్ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట హృదయం లోపల. విజయ్, భాగ్యశ్రీ నటించిన ఈ పాట తెగ వైరల్ అయింది. అందులోని ముద్దు సీన్లు, భాగ్యశ్రీ, విజయ్ కెమిస్ట్రీ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే, అది సినిమాలో కనిపించడం లేదని పలువు...