Hyderabad, మే 10 -- టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెండు, మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాల మేకర్స్ రౌడీ హీరో అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ అందించారు.

రెండు సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్స్‌ను మే 9న రిలీజ్ చేశారు. వాటిలో ఒకటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో వస్తోన్న ఎస్‌వీసీ 59 సినిమా. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

శుక్రవారం (మే 9) హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ "ఎస్‌వీసీ 59" మూవీ నుంచి పోస్టర...