భారతదేశం, జూన్ 16 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకే చోటు నుంచి వీళ్ల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి మరొకరు చెప్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న కామెంట్లు మరోసారి విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. విజయ్ పేరు వినగానే రష్మిక సిగ్గుపడింది.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించినప్పటి నుండి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే ప్రదేశం నుండి చిత్రాలను పోస్ట్ చేయడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. అయితే వారిద్దరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, విజయ్ గురించి అడగగానే రష్మిక పెద్దగా నవ...