భారతదేశం, జూలై 8 -- రౌడీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. విజయ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్‌ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆడియన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. విడుదలలో పలు మార్పులు చేసిన మేకర్స్ ఎట్టకేలకు యాక్షన్ డ్రామాకు సంబంధించిన అఫీషియల్ డేట్ ను ప్రకటించారు. జూలై 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది కింగ్‌డ‌మ్‌. ఈ సందర్భంగా ప్రోమో రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందంటూ రష్మిక మందన్న ఫైర్ అని పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కింగ్‌డ‌మ్‌ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోను విజయ్ దేవరకొండ ఎక్స్ లో పంచుకున్నాడు. ''ప్రపంచ వ్యాప్తంగా జూలై 31. మన డెస్టినీస్ అన్ ఫోల్డ్ కానివ్వండి. నవల లాంటి గౌతమ్ కథకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు'' అని విజయ్ ఆ...