Hyderabad, జూలై 31 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం కింగ్‌డమ్. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్‌డమ్ సినిమాలో మరో హీరో సత్యదేవ్ నటించాడు. హీరోయిన్‌గా బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది.

లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కావడంతో కింగ్‌డమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జూలై 31న అంటే ఇవాళ థియేటర్లలో కింగ్‌డమ్ విడుదలైంది.

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాపై ఇప్పటికే హీరో నాని, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ రూమర్ గర్ల్‌ఫ్రెండ్, నేషనల్ క్రష్ రష్మిక...