Hyderabad, సెప్టెంబర్ 4 -- విజయ్ దేవరకొండపై ఓ కంటెంట్ క్రియేటర్ విమర్శలు చేయడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ విమర్శలకు మూలం.. ఈ ఏడాది మే నెలలో అతడు చేసిన ఓ వివాదాస్పద కామెంటే. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ తన కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటారని, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తారని విజయ్ అన్నాడు. ఈ కామెంట్స్ ను విమర్శిస్తూ ఫర్హాన్ అనే ఓ కంటెంట్ క్రియేటర్ అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోను తొలగించారు. దీనిపై అతడు తాజాగా మరోసారి స్పందించాడు. విజయ్ ఒత్తిడి వల్లే ఆ వీడియోను తొలగించారన్నట్లుగా పరోక్షంగా విమర్శలు చేశాడు.

కంటెంట్ క్రియేటర్ ఫర్హాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త వీడియోను పోస్ట్ చేశారు. దానిలో 'ఒక యాక్టర్ నా వీడియోను తీసేయించారు' అని రాశారు. వీడియోలో విజయ్ పేరు చెప్పకుండా.. "ఇప్పుడు నేను అతడు లేదా ...