భారతదేశం, నవంబర్ 8 -- విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలతో ఇటీవల నటి రష్మిక మందన్న హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య హానెస్ట్ టౌన్‌హాల్‌తో జరిగిన ఒక క్యాంపస్ సంభాషణలో రష్మిక తనకు కాబోయే భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించింది. అలాగే తను ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కూడా వెల్లడించింది.

ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని చంపుతారు, పెళ్లి చేసుకుంటారు, డేట్ చేస్తారని రష్మిక మందన్నను ప్రశ్న అడిగారు. రష్మిక తాను నరుటో (అనిమే క్యారెక్టర్)తో డేట్ చేస్తానని, విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె సమాధానానికి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే విజయ్ తో ఎంగేజ్మెంట్ అయిన నేపథ్...