Hyderabad, జూలై 15 -- నటుడు విజయ్ దేవరకొండ నిజ జీవిత వ్యక్తిత్వం, మీడియాలో అతనికున్న ఇమేజ్‌కు సరిపోలడం లేదని సినీ నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డాడు. తమ రాబోయే చిత్రం 'కింగ్‌డమ్' ప్రమోషన్స్‌లో భాగంగా.. గుల్టేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ.. విజయ్‌ను సమర్థిస్తూ అతన్ని 'టార్గెట్' చేస్తున్నారని, అతడు చెప్పే ప్రతి మాటను ఉద్దేశపూర్వకంగా వివాదంగా మారుస్తున్నారని అన్నాడు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న మూవీ కింగ్‌డమ్. అతడు 2019లో నానితో తీసిన 'జెర్సీ' తర్వాత ఆరేళ్ల పాటు తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో 'కింగ్‌డమ్' ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి మాట్లాడుతూ.. విజయ్ చేసే ప్రతి బహిరంగ ప్రకటన వివాదాస్పదం కావడాన్ని వంశీ ప్రస్తావించాడు.

"విజయ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. తన సినిమాలు సరిగా ఆడక ఇప్పటికే ఇబ...