భారతదేశం, ఆగస్టు 4 -- రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కు సండే షాక్ తగిలింది. కింగ్డమ్ రిలీజైన తర్వాత వచ్చిన తొలి ఆదివారం (ఆగస్టు 3) కలెక్షన్లు ముందు రోజు కంటే తగ్గడం గమనార్హం. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటించిన కింగ్డమ్ (Kingdom) గురువారం (జులై 31) థియేటర్లలో విడుదలైంది. విజయ్ గత కొన్ని సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

భారీ అంచనాల మధ్య కింగ్డమ్ తో థియేటర్లకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ఓపెనింగ్ అదిరిపోయింది. కానీ ఆ తర్వాత మిక్స్ డ్ రివ్యూస్ కారణంగా కలెక్షన్లు పడిపోయాయి. ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ తాజా అప్ డేట్ ప్రకారం ఆదివారం వసూళ్లు తగ్గాయి. ముందస్తు అంచనాల ప్రకారం ఇండియాలో రూ.7 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. శనివారం కలెక్షన్లు రూ.8 కోట్లతో ...