Hyderabad, జూలై 11 -- స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బ్రహ్మముడిలో కావ్యగా, కళావతిగా అద్భుతమైన నటనతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది దీపిక రంగరాజు. బుల్లితెర షోలలో నిత్యం నవ్వుతూ పంచులు, ప్రాసలతో అందరిని నవ్వించే దీపిక రంగరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పింది.

జబర్దస్త్ బ్యూటి వర్ష హోస్ట్‌గా చేస్తున్న షో కిసిక్ టాక్స్. తాజాగా కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా దీపిక రంగరాజు అలియాస్ బ్రహ్మముడి కావ్య హాజరు అయింది. ఈ టాక్ షోకి రావడంతో వర్షపై పంచులు వేసి నవ్వించింది దీపిక.

నవరసాలు చేసి చూపించిన దీపిక రంగరాజు. "ఆన్‌స్క్రీన్‌లో రొమాంటిక్ సీన్ వస్తే ఏ హీరోతో చేస్తావు" అని వర్ష అడిగితే.. "ఏ హీరో అయిన ఓకే. వాళ్లే సిగ్గుపడతారు....