భారతదేశం, డిసెంబర్ 5 -- వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ.. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్డమ్' సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాటలు, ప్రోమోలు సంచలనం సృష్టించినా.. సినిమా మాత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ప్లాన్స్ ను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కింగ్డమ్. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో మూవీ రిలీజ్ అయింది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. రెండో భాగం 2026 ఆరంభంలో రావాల్సి ఉంది. అయితే తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం ప్రకారం మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో నిర్మాతలు సీక్వెల్ ఆలోచనను పూర్తి...