Hyderabad, ఏప్రిల్ 30 -- విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన టీజర్ వీడియో ఎంతగానో ఆకట్టుకోగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వస్తోంది.

కింగ్డమ్ మూవీ నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ హృదయం లోపల. ఈ సాంగ్ శుక్రవారం (మే 2) రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

"నమ్మకద్రోహం నీడల్లో, ఓ బంధం నటిస్తుండగా.. ఉద్రిక్తమైన ఆకర్షణ ఉంది. కింగ్డమ్ ప్రపంచం నుంచి అనిరుధ్ సాంగ్.. మళ్లీ మళ్లీ మీరు వినాలనుకునే పాటగా ఇది మిగిలిపోతుంది.. హృదయం లోపల" అనే క్యాప్షన్ తో విజయ్ ఈ విషయాన్ని చెప్పాడు.

ఈ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశాడు. ఇది విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఓ ఘాటు ము...